- Advertisement -
కుల్కచర్ల: మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయిని అంజిలయ్య ఆదివారం ఆకస్మికంగా మృతిచెందారు. కాగా విషయం తెలుసుకున్న టిడిపి జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ సోమవారం స్థానిక నేతలను బాధిత కుటుంబీకుల ఇంటింటికి పంపించి ధైర్యాన్ని చెప్పి భరోసా ఉంటామని పేర్కొంటూ తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. బీసీలందరూ సంఘటితంగా ఉంటూ ఒకరికొకరు తోడునీడగా నిలవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజనేయులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య, టిడిపి నాయకులు రమేష్, స్థానిక నాయకులు, ముదిరాజ్ సంఘ నేతలు బుగ్గయ్య, వెంకటయ్య, రాములు, శ్రీను, బుగ్గయ్య, రమేష్, బాల్ రాజ్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -