Wednesday, January 22, 2025

అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Telugu engineer dies in America

వాషింగ్టన్: అమెరికాలో తెలుగు ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఇంజనీర్ జలపాతంలో పడి మృతిచెందాడు. మృతుడిని మెకానికల్ ఇంజనీర్ ఎన్. హరీశ్(35) చౌదరిగా గుర్తించారు. పదేళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేసి కెనడాలోని అంటారియోకు వెళ్లి ఓ కంపెనీలో టూల్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఐదుగురు స్నేహితులతో కలిసి హరీశ్ విహారయాత్రకు అమెరికాకు వెళ్లాడు. 11న న్యూయార్క్ లోని ఇతాకా జలపాతం దగ్గర ఫొటోలు దిగుతుండగా వెనక్కి జారీ పడిపోయాడు. నీటి ఉధృతికి కొట్టుకు పోయి చనిపోయాడని స్నేహితులు చెబుతున్నారు. తానా సహకారంతో హరీశ్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం హరీశ్ కు సాయిసౌమ్యతో వివాహమైనట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News