Tuesday, January 21, 2025

ముగిసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 6గంటలకు టిఎఫ్ సిసి ఫలితాలు వెల్లడికానున్నాయి. టిఎఫ్ సిసి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సి. కల్యాణ్ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 1233 మంది ఓటు వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 810 మంది ఓటు వేశారు. స్టూడియో సెక్టార్ నుంచి 68 మంది ఓటు వేశారు. డిస్ట్రబ్యూషన్ సెక్టార్ నుంచి 355 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఫిలిం ఛాంబర్ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News