Monday, December 23, 2024

ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఐకానిక్ ఫినాలే ఫైనలిస్ట్‌ల పరిచయం..

- Advertisement -
- Advertisement -

సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’. అతి పెద్దదమైన ఈ సంగీత వేదిక సీజన్ 1కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు అనూహ్య స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌కు చెందిన సింగర్స్ పాల్గొంటున్న ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ ఐకానిక్ ఫినాలేలో భాగంగా ఫైనలిస్ట్‌లను పరిచయం చేశారు షో జడ్జీలు షో జడ్జీలు తమన్, కార్తీక్, గీతా మాధురి. ఫైనలిస్టులుగా ఎంపికైన కార్తికేయ, శృతి, జయరాం, లాస్య, సౌజన్యలు తమదైన శ్రావ్యమైన గాత్రాలతో పాటలు పాడి అలరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ “ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఎనర్జిటిక్ అండ్ ఎంగేజింగ్ ప్రోగామ్ మాత్రమే కాదు ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్ కూడా. ఈ అతి పెద్ద సంగీత వేదిక ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది”అని అన్నారు. ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ మాట్లాడుతూ..“ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ప్రారంభించినప్పుడు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్, డబుల్ ఫన్ ఉంటుందని హామినిచ్చాము. దానికి ప్రేక్షకులు కూడా మాకు డబుల్ లవ్, డబుల్ సబ్‌స్క్రిప్షన్ నెంబర్‌ను చూపించారు. గత సీజన్ కంటే రెట్టింపు వ్యూయింగ్ మినిట్స్ రావడం చాలా ఆనందంగా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రీమాంటల్ మేనిజింగ్ డైరెక్టర్ ఆరాధన, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News