Sunday, November 24, 2024

కూల్చుతామంటేనే ఫిరాయింపులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫిరాయింపుల పై ఎలాంటి ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని రేవంత్ తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), చై ర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని ఆయన చె ప్పుకొచ్చారు. అసెంబ్లీ చివరిరోజు బిఅర్‌ఎస్ స భ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు, ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని సిఎం ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయాంలో పీఏసీ పదవి కాంగ్రెస్‌కు కాకుండా ఎంఐఎంకు ఇచ్చారని ఆ యన చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎలా ఉంటారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు.. ఎ లా ఇస్తారు..? అంటూ సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీ పర్యటన లో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో జరిగి న చిట్‌చాట్‌లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మ రోవైపు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బ్రతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా..!? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కెసిఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కెసిఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కెసిఆర్, కెటిఆర్‌లకు తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని సిఎం డిమాండ్ చేశారు.

నేతలు పార్టీ ఫిరాయించకుండా చట్టం కఠినంగా ఉండాలి
పార్టీ ఫిరాయింపులపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై తాజాగా ఈ తీర్పుపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పుపై తామింకా అధ్యయనం చేయలేదన్నారు. అందుకే దానిపై ఇప్పుడే స్పందించలేనని ఆయన తెలిపారు. మా సర్కారుకు డోకా లేదని, మా సంఖ్యాబలం 65 అని, అందులో నుంచి ఎవరూ మారే అవకాశం ఉండకపోతే మాకే మేలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. నేతలు పార్టీ ఫిరాయించకుండా చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి ఢోకాయే ఉండదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు మూడునెలల్లో తమ ప్రభుత్వాన్ని పడగొడతాం, మూడు నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నది వాళ్లు, పడగొట్టే అవకాశమే లేకుండా చట్టం కఠినంగా ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదని సిఎం అన్నారు. బిఆర్‌ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని ఎవరి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండదని ఆయన చెప్పారు. ఫిరాయింపులు పూర్తి స్థాయిలో చేసింది వాళ్లే, ఇప్పుడు బిఆర్‌ఎస్ వాళ్లు నీతులు చెబుతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందని, దానిపై తాను కామెంట్ చేయనని ఆయన తెలిపారు. స్పీకర్ తన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

సిఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఢిల్లీ జర్నలిస్టులు
జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. సిఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయులకు ఇళ్లు, హెల్త్ కార్డ్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సిఎం రేవంత్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను సిఎం కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. దీంతోపాటు వర్షాలు, -వరదలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్లుగా తెలిసింది. అనంతరం గురువారం రాత్రి తిరిగి సిఎం రేవంత్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News