Saturday, February 22, 2025

వర్తమాన తెలుగు కథ ఒక విహంగ వీక్షణం

- Advertisement -
- Advertisement -

ఏది వర్తమానం. ఈరోజుదా. ఈ సంవత్స రానిదా. వస్తువుని నిర్ధేశించే దశదా.
1911 దిద్దుబాటు.. దాని వెనుక దిద్దుబాట్లు..కథా మొదలు అనుకుంటే, గురజాడ నుంచి శీలం సురేంద్ర, అచ్చమాంబ నుంచి మన్ ప్రీతమ్ దాకా ఐదు తరాల తెలుగు కథ నడచిపోయింది.
ఇటీవల రెండు వేలో సంవత్సరం నుంచి రాయ డం ప్రారంభించిన కథకులతో ఆధునిక తెలుగు కథ ఒకటి తెచ్చారు. అంటే వాళ్లు రెండు వేల తర్వాత కథను వర్తమాన కథ అనుకుంటు న్నారు. ఇదంతా వ్యక్తుల్ని కేంద్రీకరించి చేసు కున్న వింగడింపు.
1980ల తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన ఒక కుదుపు గమనిస్తే, అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతో కథా గమనం మారింది కాబట్టి, ఆ తర్వాత వచ్చిన కథా సాహిత్యం తాజా జీవిత కోణాలను పట్టుకుంది కాబట్టి కొత్త అనుభవా లనూ అంత దాకా చూడని చీకటి పైన వెలుగు పరచింది కాబట్టి అక్కడ్నంచీ కూడా వర్తమానమే, అనుకోవచ్చా?!
కథా వస్తువు బట్టి చూస్తే, మొదటి తరం సంస్క రణను ఆకాంక్షించిన దశ. దిద్దుబాటు అయినా, అరికాళ్ళ కింద మంటలైనా, ఓ పువ్వు పూసింది అయినా సంస్కరణే.
కొకు, రావిశాస్త్రి, కారాల కథ ఏదో మేరకు విప్లవ, ప్రతిఘటన, వర్గపోరాట కథనం. ఇది రెండో దశ. మూడో దశ స్త్రీ వాద, దళిత, బహుజన వాద కథా సాహిత్యం. ప్రపంచీకరణ ప్రభావం కథా సాహి త్యం నాలుగో దశ. ఇప్పుడు ప్రతి కథకుడూ పైన చెప్పిన అన్ని వస్తువులనూ కలగలిపి రాస్తున్నాడు. నిజానికీ దశ మైదానంలో పారే నది. అన్ని వాదా ల, వుద్యమాల సారాంశాన్ని కథనం చేసుకునే వెసులుబాటు యిప్పుటి కథది.
వర్తమాన తెలుగు కథాసమయంలో విముక్తి ఉద్య మాల ప్రసక్తి వుండదు. ఉన్నా దాని మీద చిన్న పా టి గౌరవాన్ని వ్యక్తం చేసి దాని వల్ల జరిగిన నష్టా న్ని చెప్తారు. (గన్స్ &మాన్సూన్‌లో లాగా) వర్త మాన తెలుగు కథలో విప్లవ శిబిరం రచ యితలు తమ దృష్టిని ఫాసిస్టు ధోరణుల మీద కేంద్రీకరిం చారని చెప్పొచ్చు.’సిక్స్ ప్యాక్ రాముడు’ కథలు (పావని)యిందుకు ఉదాహరణ. వర్తమాన తెలుగు కథలో బహుజన కులాల రచయితలు బాగా రాస్తున్నారు. తమ సమూహాల జీవిత దృ శ్యాలను, మనమింతదాకా చూడనివి చూపిస్తు న్నా రు. కుల వృత్తుల కథలను వెలువరిస్తున్నారు. చేనే త కథలూ, అడపం కథలూ, మల్లెసాల కథలూ, యిందుకు వుదాహరణ. ఇప్పటి తరం రచయితలు సాఫ్ట్వేర్ రంగం నుంచి చాలా మంది వున్నారు. వాళ్లు అక్కడి జీవితాన్ని చూపించి, ఘర్షణలనూ, వేదనలనూ, అక్కడ మాత్రమే సాధ్యమైన ధోరణు లనూ చిత్రిస్తున్నారు. అందులో పూర్ణిమ తమ్మిరెడ్డి, మన్ ప్రీతమ్ లాంటి వాళ్లు రాసిన కథలు చదివి తీరాల్సినవి.
స్త్రీ వాద కథలైతే యీ తరం కథకురాళ్లు బలంగా రాయడం లేదు. అపర్ణా తోట,మానస ఎండ్లూరి, ఎండపల్లి భారతి లాంటి ఫైర్ బ్రాండ్లు ఒకరిద్దరు వున్నా, అది మునుపటిలా ఉద్యమంగా లేదు.
దళితోద్యమం కూడా. ప్రభావంగా లేకున్నా దళిత కథను వర్తమాన రచయితలు రాస్తున్నారు.
కటికపూలూ, మునికాంతపల్లి కథలూ, ఎదారి బతుకులూ, పార్వేట, మిళింద, కొత్త వంతెన, బైండ్ల చంద్రయ్య లాంటి కథలు తెలుగు నేల మీద అన్ని ప్రాంతాల నుంచి దళిత జీవితం సాహిత్య మవుతోంది అనడానికి వుదాహరణలు.
గిరిజన కథలు తెలుగు సాహిత్యంలో తక్కువ. ఆ సమూహాల రచయితలు లేనందున ఆ జీవితం మై దానం నుంచి రాసే కథకుల దృష్టి నుంచి గానీ విప్లవోద్యమం నేపథ్యంలో గానీ యింత దాకా చదివాం.మల్లిపురం జగదీష్ వల్ల ఆ లోటు తీరింది . ఇప్పుడు రమేష్ కార్తీక్ నాయక్ తెలంగాణ నుంచి రాస్తున్నాడు. కొంచెం సీనియర్ రచయితలే అయి న పలమనేరు బాలాజీ, వాడ్రేవు చిన వీరభద్రుడు వర్తమానంలో ఎరుకల, ఆదివాసీ కథలు రాశారు. చిన వీరభద్రుడు రాసిన మాప్ మేకింగ్, నమ్మదగ్గ మాటలు, గొప్ప కథలు. భద్రుడు గిరిజన సమూ హానికి చెందనప్పటికీ గిరిజన ప్రాంతాల్లో జన్మిం చిన వాడు కావడాన, అధికారిగా వాళ్ల కోసం పనిచేసిన వాడు కావడాన ఆ కథలు తాదాత్మ్యం చెం దించే కథలు. బాలాజీ ఎరుకల సమూహానికే చెందిన మంచి రచయిత, మూడు కథా సంపుటాలు తర్వాత యింత కాలానికి తన కథలు రాసుకున్నాడు. మనమంతా చదవా ల్సిన గిరిజన కథలివి.
వర్తమాన తెలంగాణ కథ, ఇటీవల తాను వ్యక్తి నిష్ఠ నా లేక సమూహ నిష్ఠనా అని చర్చ చేసు కుంది. తన అస్తిత్వాన్ని అన్ని రంగాలా చాట డానికి చూస్తోంది. వర్తమాన రాయలసీమ కథ, ఆ ప్రాంతపు పాత కథా మాస్టర్లని దాటుకుని, రాయలసీమయిలా వుంది అని చెప్పే దశను దాటి, యిలా యిప్పటికీ ఎలా వుంది? అని చెప్పడానికి ప్రయ త్నిస్తు న్నట్టు కనిపిస్తుంది.
వర్తమాన కాలంలో తెలుగు కథ గురించి మాట్లా డేటప్పుడు పాత ధోరణి వస్తువులను కాకుండా నేటి కాలంలో సమాజం జీవితాన్ని వొడిసి పట్టుకున్న కథల సంకలనాలైన ‘కాగితాల కావల’, (సీసీఎన్ ఆర్సీ) ‘పూలతోట’ (కౌమార దశలోని పిల్లల గురిం చి కథలు) వీటినీ పరిగణించాలి. (సంపాదకత్వం కుప్పిలి పద్మ) వర్తమాన తెలుగు కథలో ముస్లిం కథనీ మనం గమనించాల్సి వుంది. వర్తమానంలో ఆ సమూహం ఎదుర్కొంటున్న ఘర్షణని కథల్ని చే స్తున్న వాళ్ళు కూడా యువకులే మరి. స్కై, షరీఫ్, గౌస్, రూబినా పర్వీన్‌లను మంచి కథకులుగా మనం గుర్తించాలి. మొత్తానికి వర్తమాన తెలుగు కథ అన్ని వాదాల, ధోరణుల సారాంశాన్ని యిముడ్చుకొని కొనసాగుతోందని చెప్పొచ్చు.
జి.వెంకటకృష్ణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News