Sunday, December 22, 2024

కవితాస్వర విన్యాసం అశ్రుస్వరం

- Advertisement -
- Advertisement -

కవిత్వం మరియు ఒక సామాజిక చైతన్య స్ఫూర్తిని నింపే అక్షరం ప్రవాహం. కవిత్వం లలిత కళా రంగంలో ఒక స్ఫూర్తిదాయకమైన అంశం. ఈ కవిత్వంతో పాటు శాస్త్రీయ సంగీతం చిత్రకళ నాటకం నృత్య ప్రదర్శనలు జానపద కళలు మిమిక్రీ గజల్ మొదలైన జానపద కళారూపాలు సమాజానికి స్ఫూర్తిని చైతన్యాన్ని అందిస్తున్నాయి. ఈ జానపద కవిత కళ రూపాలను గత నాలుగు దశాబ్దాల కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో ఈ కలలకు ప్రాణం పోస్తూ కలలను పోషిస్తున్న ప్రముఖ కవి సామాజిక చైతన్య స్ఫూర్తి బహుముఖప్రజ్ఞాకు, పర్యాయపదం పెద్దిరెడ్డి గణేష్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సూర్యాపేట జిల్లాలో జానపద కళా పోషకుడుగా, కవితా సంపాదకుడుగా, సూర్యాపేట పట్టణ బ్రాండ్ అంబాసిడర్ గా, తనదైన శైలిలో సమాజానికి కవితాపరమైన సాహితీపరమైన సేవలందిస్తున్న పెద్దిరెడ్డి గణేష్ గారి కలం నుంచి జాలువారిన జీవిత తాత్విక అక్షర రూపమే అసురస్వరం.

అశ్రుస్వరం కవిత సంపుటి జీవితానికి సంబంధించిన అనేక సామాజిక అంశాలను, కుటుంబం, ప్రకృతి, మానవ సంబంధాలను అందంగా చిత్రీకరిస్తుంది. ఈ కవితలలో రచయిత తన భావోద్వేగాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి శక్తివంతమైన భాషను ఉపయోగించాడు. కొన్ని కవితలు ప్రియమైన వ్యక్తుల నుండి విడిపోవడం వల్ల కలిగే బాధను వ్యక్తపరుస్తాయి. కొన్ని కవితలు ప్రకృతి యొక్క అందం, శక్తిని వర్ణిస్తాయి. పెద్దిరెడ్డి గణేష్ శక్తివంతమైన భాషను ఉపయోగించి తన భావోద్వేగాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను చాలా సరళమైన భాషను ఉపయోగిస్తూనే, అందమైన వాక్యాలను రూపొందించగలడు.

రెండు ఊపిరితిత్తుల్లోకి/రెండు వాయుగోళాలని/ఆవాహన చేసుకుని/పూరించిన బుగ్గల తో/అతని అసమాన స్వర విన్యాసం శ్రోతల్ని/ఓ తన్మయ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది/ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తుంది/అని దేశ విదేశాలలో భారతీయ సంగీతానికి అత్యంత ప్రాచుర్యం సంపాదించిన కర్ణాటక విధ్వాంసలు పద్మశ్రీ పత్రి గోపాల్ నాథ్ స్మృతిలో కవిత్వాన్ని పూరించారు పెద్ద రెడ్డి గారు. అంతరాంతర ఆకాశ శూన్యాల్లో/ఆలోచనల మబ్బుల మధనం జరగాలి/లోపల్లోపలి పొరల మధ్య అనుభవాల/అల్పపీడనంతో అనుభూతుల గాలులు వీయాలి/అప్పుడు గాని/చినుకు చినుకుగా/అక్షర జల్లు భువి చేరుతుంది/ప్రశాంతంగా సాగే పాట నది ఓ మలుపులో/ఇరుకైన ఇరుగట్లను ఉరుసుకు సాగుతూ/చిత్త చివరి ప్రవాహ ప్రయాణంలో/చిన్న చిన్న పాయలుగా చీలి/జన సముద్ర హృదయాలలో సంగమిస్తుంది/అంటూ పాట నదీ ప్రవాహానికి తన కవిత్వాన్ని క్రోడీకరించారు పెద్దిరెడ్డి గారు. కాలాన్ని కలాన్ని నమ్ముకున్న వాణీ/పొద్దుతో లేచి రాత్రి నిద్ర పోయేదాకా/గడియారం ముళ్ళు ముడేసుకుని/లాభనష్టాలతో పని లేని రోజుల్ని/వేడుకలు వేదనల కావిడిని/సమతూకంగా మోసుకుపోతూ/ప్రతిరోజు మళ్లీ కొత్తగా పుట్టే నాకు/రోజు పుట్టినరోజు పండగే/జీవిత గమ్యంతో జీవన గమనముతో ప్రయాణం చేసేవాడికి రోజు పుట్టినరోజు అంటూ పెద్దిరెడ్డి గారి కవిత ఆలోచన ఆలోచింపజేస్తుంది.

సముద్రానికి నాకు మధ్య/ఏదో పేగు బంధం ఉందనుకుంటా/సముద్రం ముందు నిలబడతాను/తన అలల చేతులతో అల్లుకొని/నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది/అప్పుడు నాలో ఒక సముద్రం/బయట ఒక సముద్రం/ఆవేశంతో ముందుకు వచ్చేవి కొన్ని/సంయమనంతో మధ్యలోనే వెనక్కి తగ్గేవి కొన్ని/మనకు తెలియకుండానే దొంగ దెబ్బ తీసేవి కొన్ని/మనుషుల నైజాలకు/మారురూపాల్లా ఉంటాయి కెరటాలు/నాకే కాదు సమస్త మానవాళికి/సముద్రంతో పేగు బంధం ఉంది. అంటూ సముద్రంలో వచ్చే అలలు జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలతో మిళితమై ఉన్న జీవన సత్యాన్ని కవిత్వీకరించారు పెద్ద రెడ్డి గారు. యుగాంతపు విషగాలులు/ప్రపంచాన్ని కమ్ముకుంటున్న వేళ/మన ముని వాకిట ఈ పొద్దున/ఉగాది చిగురుటాశ తొడిగింది/అనాది కాలంలో ఎన్ని యుగాంతాలు ఉన్నాయో/అన్ని ఉగాదులు ఉన్నాయి/సరికొత్త మానవయ్య అద్భుత రసాయనాన్ని/షడ్రుచుల ఉగాది పచ్చడిలా మేలవించి/మానవాళికి అందరికీ మహాదానందంగా పంచుదాం/

అంటూ తెలుగు సంవత్సరాది ఉగాది యొక్క విశిష్టతను జీవిత కాలచక్రంలో కష్టసుఖాలను షెడ్రుషులతో మిళితం చేసి కవిత్వీకరించారు. ఎక్కడ ఎప్పుడు ఎట్లా మొలుస్తుందో విత్తనం/కాలం పొత్తిళ్లలో మొలకెత్తి చిగురు తొడుకుతుంది/రంగురంగుల రెక్కల పక్షులకు/స్థిరనివాసం విలాసం ఆ చెట్టు/సకల చర జీవులకు ఆచర స్థావరం చెట్టు/ఊరంటే మన ఉనికి/ఊరంటే మన తల్లి వేరు/చెట్టుకి మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని తెలియజేస్తూ మన తల్లి వేరు మన చెట్టు మన చెట్టే మన ఊరు మన చుట్టూ మన ఊరు చుట్టూ చెట్టు ఉంటేనే జీవితానికి ఆనందం ఆరోగ్యం అనే విధంగా ఊరు చెట్టు కవితను రాశారు. అప్పుడప్పుడే/ఊహలు పొటమరిస్తున్న బాల్యంలో/ఎప్పుడో సరిగా గుర్తు లేదు కానీ/ఓ లేత మృదుస్వరం పాటగా/నా మీద చిరుజల్లులుగా కురిసిపోయింది/

అతని పాటతో నాకు/ఎన్నెన్ని జన్మల బంధమో తెలియదు కానీ/రుతుభేదం లేని గాన ధారలై/నాపై నిరంతరము కురవాల్సిందే/నేనో కొమ్మ రెమ్మల తరువై/చిరువు శిరస్సు వంచి/తన్మయంగా మొక్కాల్సిందే/పాటకి ప్రభావమైనటువంటి తన మనసుని కవిత్వీకరించారు పెద్ద రెడ్డి గారు. పొద్దున్నే తోటలోకి/ఓ పాలపిట్ట వచ్చి వాలింది/వస్తూ వస్తూ ఆకాశాన్ని కాస్త చిదిమి/తన రెక్కలపై పూసుకు వచ్చింది/ఆటవిడుపుగా అరణ్యాలను వదిలి/జనారన్యా లలోకి వచ్చిందేమో/ఆకాశం ఒక రెక్క భూగోళం మరొక రెక్కగా చాచి/అవధులు లేని ఆనందం అంబరాన్నే కాదు/పాలపిట్టల పాలపుంతవరకు పయనం కట్టొచ్చు కదా/భూమి ఆకాశాలను తన ఇష్టానుసారంగా తిరిగి వచ్చే ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్న పాలపిట్ట యొక్క ప్రాధాన్యతను తన కవితా సంపుటిలో పొందుపరిచారు.

బతుకమ్మ పండుగ0టేనే/పది కాలాలు అందరూ చల్లగా బతకాలని/దీవిస్తూ బతుకు నిచ్చేది బతుకనిచ్చేది/రంగు రంగు పూలు రకరకాల పూలు/ఒక్కచోట కొలువై ఆటపాటల పండగయ్యేది/కష్టసుఖాలు కలిసి పంచుకుంటూ/బ్రతుకు నిచ్చే బ్రతకనిచ్చే పెద్ద బతుకమ్మ మా ఊరు/అని ఊరే ఒక బతుకమ్మ తెలంగాణ సంప్రదాయం సంస్కృతితో మిళితమైన ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ అదే మన తెలంగాణ పూరి పండగ అని రచయిత తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిక వారసత్వాన్ని ఊరితో ముడి పెట్టి లోతైన కవిత్వాన్ని అందించారు.

యుద్ధం ఎప్పుడు ఆగినట్లు గుర్తులేదు/ఏ పక్క నుండి ఏ శత్రువు దాడి చేస్తాడో/ఎటువైపు అడిగేస్తే/ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహకందదు/క్షణక్షణం అప్రమతమై చరించాల్సిందే/శ్వాస ఉన్నంత వరకు సాగే యుద్ధం/బ్రతికి ఉన్నంతకాలం బ్రతికే యుద్ధం/అంటూ జీవితమే ఒక యుద్ధరంగం నిరంతరము మనతో మనము యుద్ధం చేస్తూనే ఉండాలి ఈ సమాజం అనబడకై అనే నినాదంతో యుద్ధం అనే కవితని జీవిత తాత్వికతతో ముడిపెట్టారు. లోపల అంతా శిథిలమై చీకట్లు కమ్మినాక/పైకి తళుకులీనే తన్మయత్నం ఎట్లా కనిపిస్తుంది/మహావృక్షంగా ఆకాశమంత ఎదిగిన చెట్టు లక్షణం/సమస్తము దాని విత్తనంలోనే దాగి ఉన్నట్టు/మన అంతరాంతరాలలో ఉన్న శుప్త చైతన్యమే/జీవనోత్సాహ అనుభవమై ముందుకు నడిపేది/అందుకే మన లోన ప్రయాణం ప్రశాంతమైతేనే/బయటి ప్రపంచం ఆహ్లాదంగా ఉండేది/మనిషి తన లోపల తనతో తాను ప్రయాణం చేస్తేనే ఈ ప్రపంచమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది లేకుంటే జీవితం ప్రమాదంలో పడుతుంది జీవిత సత్యాన్ని ఈ కవితలో చాటి చెప్పారు పెద్దిరెడ్డి గణేష్ గారు.

ఈ అశ్రుర స్వరం కవితా సంపుటి తల్లావజలశివాజీ కారు బండరాళ్ల మధ్య చిన్నారి మొలక అంటూ ముందుమాటను అందించారు. పేజీ కొకఒయాసిస్సు వైవిధ్య స్వరాలతో భిన్న కంఠస్వరంతో పెద్దిరెడ్డి గణేష్ గారి కవిత యాత్రను కొనసాగించాలి అంటూ ఎమ్యి రామిరెడ్డి గారు లోతైన విశ్లేషణ చేశారు. ఈ అశ్రుస్వరం కవితా సంపుటిని ప్రముఖ కవి. నాటక సినీ రచయిత, ప్రయోక్త, నటుడు, దర్శకుడు, లఘు చిత్ర నిర్మాత, శివతత్వ గాయకుడు, మరెన్నో రంగాలలో ప్రజ్ఞాశాలి, అమరికలు లేని స్నేహశీలి, అచ్చమైన స్వచ్ఛమైన మనిషి శ్రీ తనికెళ్ళ భరణి గారికి అంకితం ఇవ్వడం తెలుగు సాహిత్యానికి కవిత్వానికి పెద్దిరెడ్డి మనస్తత్వానికి ఇదొక అనిర్వచనీయమైన సాహితీ ప్రస్థానంగా నేను భావిస్తూ పెద్దిరెడ్డి గణేష్ గారికి అక్షర నమస్సుమాంజలీలు.

-పూసపాటి వేదాద్రి, 9912197694

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News