Monday, January 6, 2025

ఆ విధంగా తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో రెండో రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరిగాయి.  ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో జరగాలని డిమాండ్ చేశారు. సినిమాల పేర్లు కూడా తెలుగులోనే ఉండాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిర్వహకులు సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News