Wednesday, March 26, 2025

అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆమెరికాలో ఉంటూ ఉద్యోగం పోయిందనే బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఓ తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని స్వదేశంకు తీసుకువచ్చేందుకు విరాళాలు కావాలని అతని సోదరుడు పెట్టిన పోస్టుతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోకి కృష్ణ జిల్లా గుడివాడ రూరల్ దొండపాడుకు చెందిన అభిషేక్ కొల్లి, అతని సొందరుడు అరవింద్‌తో కలిసి పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది కిందట అతనికి వివాహం జరిగింది. భార్యతో కలిసి అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో అభిషేక్ ఉద్యోగం పోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు తట్టుకోలేక.. డిప్రెషన్‌లోకి వెళ్లిన అతను శనివారం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.

దీంతో అభిషేక్ భార్య ఆందోళన చెంది.. చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇచ్చింది. దీంతో అంతా కలిసి గాలించారు. ఈ క్రమంలో పోలీసులు ఫిర్యాదు చేయడంతో వాళ్లు, వాలంటీర్లతో చుట్టుపక్కల అంతా గాలించారు. చివరకు అభిషేక్ మరణాన్ని అతని సోదరుడు అరవింద్ ధృవీకరించాడు. తన సోదరుడు అభిషేక్ మృతదేహాన్ని ఇండియా తీసుకుపోయేందుకు అరవింద్ గో ఫండ్ మీలో విరాళాలు సేకరిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News