Sunday, December 22, 2024

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మార్చి 28న బస్సు ఢీకొని 47 ఏళ్ల భారతీయ అమెరికన్ విశ్వచంద్ కొల్లా మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఎయిర్‌పోర్టుకు సంగీత కళాకారుడ్ని కలుసుకుని తీసుకురాడానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.

ఆరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లోయర్ లెవెల్ ఆఫ్ టెర్మినల్ బి వద్ద ఆ సంగీత కళాకారుడ్ని పికప్ చేసుకోడానికి వేచి ఉండగా బస్సు ఢీకొందని మసాచుసెట్స్ స్టేట్ పోలీస్‌లు చెప్పారు. విశ్వచంద్ తన కారుడ్రైవర్ వైపు నిలబడి ఉండగా, అదే సమయంలో డార్జ్‌మౌత్ ట్రాన్స్‌పోర్ట్ మోటార్ కోచ్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిందని పోలీసులు వివరించారు. వెంటనే ఒక నర్సు ఆయనకు వైద్యసహాయం చేయడానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన మృతిచెందాడని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ 54 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News