Monday, December 16, 2024

పొన్నియన్ సెల్వన్1తో భారీ క్రేజ్

- Advertisement -
- Advertisement -

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి తెలుగులో పర్వాలేదనిపించుకుంది. కోలీవుడ్‌లో ఈ సినిమాల పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. త్రిష వయస్సు 40కి చేరువలో ఉంది, కానీ మణిరత్నం మాత్రం ఆమెని 30 ఏళ్ల యువతిగా చూపించారు. దీంతో ఆమెకి మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి. తెలుగులో కూడా దర్శకులు ఆమెకి ఆఫర్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. బాలకృష్ణకి కూతురుగా శ్రీలీల నటిస్తోంది. హీరోయిన్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఐతే, పొన్నియన్ సెల్వన్ చూశాక త్రిషని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారట. గతంలో బాలకృష్ణ, త్రిష ‘లయన్’ సినిమాలో జంటగా నటించారు.

Telugu Offers to Trisha Krishnan after PS1 Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News