Monday, December 23, 2024

పంచాంగ శ్రవణం వింటే ఎన్ని లాభాలో తెలుసా?

- Advertisement -
- Advertisement -

నిత్య వ్యవహారాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన ‘గ్రిగేరియన్ క్యాలెండరు‘ ను ఉపయోగిస్తూ వున్నాగానీ.. శుభకార్యాలు, పూజాపునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగాన్ని ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఉగాదిరోజున ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం భారతీయులకు ఆనవాయితి. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనే పంచ అంగాల సమ్మేళనమే పంచాంగం.

పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరం వైపుగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకం ప్రకారం, ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారు.
పంచాంగం ఉగాదితో అమల్లోకి వస్తుంది. అది కొనసాగుతూ, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగాన్ని ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News