Wednesday, January 22, 2025

తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫలితాలు… దిల్‌రాజు ప్యానల్‌దే హవా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫలితాలు వెలువడ్డాయి. నిర్మాత దిల్‌రాజు సపోర్ట్ చేసిన ప్యానెల్ ఘన విజయం సాధించింది. జెమిని కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో దామోదర్ ప్రసాద్ ఘన విజయం సాధించారు. దామోదర్ ప్రసాద్‌కు 339 ఓట్లు పడగా జెమిని కిరణ్ 315 ఓట్లు పడ్డాయి. సుప్రియ ఆశోక్ ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇసి మెంబర్‌గా దిల్‌రాజు గెలిచారు. తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరీలు ఎన్నికయ్యారు. ఇసి మెంబర్స్‌గా డివివి దానయ్య, రవి ప్రకాశ్, యలమంచిలి రవి, శ్రీనివాస్, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవ రావు, పద్మిని, వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, కిషోర్,  అభిషేక్ అగర్వాల్, తోట కృష్ణ, రామకృష్ణ గౌడ్‌లు కొనసాగునున్నారు. జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరీ, నట్టి కుమార్ ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News