Sunday, December 22, 2024

బుధవారం రాశిఫలాలు (10-01-2023)

- Advertisement -
- Advertisement -

మేషం -నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. వాహనయోగం ప్రముఖులకలయిక.

వృషభం -బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురై అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. నూతన వస్తు కొనుగోలు.

మిథునం -ఋణవత్తిడుల నుండి బయటపడతారు. ధన, వస్తు, లాభాలు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు.

కర్కాటకం -శ్రమాధికం పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుకుంటారు.

సింహం -పూర్వపూ మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాలు.

 

కన్య -ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు.

 

తుల -కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్వల్ప ధనవస్తులాభాలు.

వృశ్చికం -కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప స్థానమార్పులు.

ధనుస్సు -కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

మకరం -విందు, వినోధాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వాహనయోగం. వివాదాలు తీరుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభం.

కుంభం -మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చర్చలలో పాల్గొంటారు.

మీనం -అనుకోని పనులలో ప్రతి బంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందును.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News