Monday, December 23, 2024

వార ఫలాలు 21-07-2024 నుండి 27-07-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి ఉంటుంది.కెరియర్‌ పరంగా స్టెబిలిటీ లేదు అని బాధపడేవారికి  మంచి స్టెబిలిటి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది.వృత్తి ఉద్యోగాలపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాన్ని విజయపథంలో నడిపించగలుగుతారు. ఎవరికీ రానటువంటి ఆర్దర్‌లు మీకు చేతికి అందుతాయి.సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలలో మీరు పడిన శ్రమకు మంచి ఫలితం లభిస్తుంది. టీచింగ్‌ ప్రాఫెషనల్‌లో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కృషి చేస్తారు. శ్రమకు ఫలితం మూడు వంతులు ఫలిస్తుంది. చేతికి వచ్చిన ధనం సద్వినియోగమవుతుంది. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడరు.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన భాగస్వాములతో వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారపరంగా మీరు ఆశించిన లాభాలు తక్కువ వ్యవధిలోనే పొందగలుగుతారు.సినిమారంగంలో ఉన్నవారికి, టీ.వీ రంగంలో ఉన్నవారికి, టెక్నిషియన్స్‌కి కాలం అనుకూలంగా ఉంది . సంతాన పురోగతి బాగున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న విషయాలు అశాంతికి కారణమవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేని వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించగలుగుతారు.  బంధువులలో కానివ్వండి, మిత్రులలో కానివ్వండి అందరిలోనూ మీరు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. మీ మంచితనమే మీకు కొన్ని సందర్భాలలో ఇబ్బంది కలిగిస్తుంది.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవితాశయం నెరవేర్చుకోవడానికి వచ్చిన అవకాశాలు మీరు ఏమాత్రం వదులుకోరు. వృత్తి ఉద్యోగాలపరంగా అదనపు బాధ్యతలు ఏర్పడినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.  మానసికమైన ఉత్సాహం కలిగి  ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులను,  అందరినీ కలుపుకుని వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి.  సంతాన పురోగతి బాగుంటుంది. ఐ.ఐ.టి లో కానీ, యం.బి.బి.యస్‌.లో కానీ ఫ్రీ సీటు సాధించే అవకాశాలు  ఉన్నాయి. సహోదర, సహోదరీ వర్గం మనస్పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత అండగా నిలుస్తారు. ఆర్థిక సాయం కూడా చేస్తారు. తల్లిదండ్రుల కోరిక మేరకు కొన్ని ఇంటిపనులు నెరవేరుస్తారు.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అంకితభావంతో పనిచేసిన మీకు సరైన గుర్తింపు లభించకపోవడం మీ మానసికమైన కోపానికి కారణం అవుతుంది.  వస్త్ర వ్యాపారం అంతగా కలిసిరాదు.శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. అనవసరమైన విషయాలను నెత్తిన పెట్టుకుని, వచ్చిన అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి గోచరిస్తుంది.నమ్మినటువంటి వాళ్ళు, మీకు సహాయం చేస్తామన్నవాళ్ళు అసలైన సమయంలో మీ కనుచూపు మేరలో కనిపించకుండా పోతారు.ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం తగదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది.విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలని కలపటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. క్లిష్టమైన ఈ సమస్య నుండి బయటపడటానికి పరిపరివిధాలుగా శ్రమించవలసి వస్తుంది.

సింహం: సింహరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. బేకరి, ఫాస్ట్‌ఫుడ్‌, కిరణా, పాలు, నీళ్ళ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. వాణిజ్య పంటలు పండించే రైతులకు లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారులకు  మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మీరు చదివిన చదువుకు తగ్గట్టు కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం మాత్రం లభిస్తుంది. పోటీ పరీక్షలలో ఎంత శ్రమించినా అనుకూలమై న ఫలితాలు రావు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ప్రయత్నాలు చేసుకునే వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. సెల్ఫ్‌డైవింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది, యోగా, మెడిటేషన్‌, వ్యాయమం కొంతవరకు మేలు చేస్తాయి. సాహిత్య, సాంస్కృతిక సభలకు, పోటీలకు మీరు ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తాత్కాలిక  వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభం పొందుతారు. అందరూ చేసే వ్యాపారాలలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి.ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో నైపుణ్యం అంకితభావం మీకు గౌరవాన్ని స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. వృత్తి, వ్యవహారాలలో నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు. బంధుత్వానికి, స్నేహాలకు తావు లేకుండా ప్రవర్తిస్తారు. కమర్షియల్‌ ఏరియాలో స్ధలం కొనుగోలు చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన విద్యా విషయంలో ఖర్చుకు వెనుకాడరు. రాజకీయ సంబంధమైనటువంటి మిత్రులను నమ్మి మోసపోవద్దు. మీ శత్రువర్గాన్ని తరిమికొడతారు. స్వశక్తి మీద నిలబడతారు. క్రీడారంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అక్కడ చేసిన అప్పులు తీర్చడానికి గాను ఇక్కడ ఉన్న ఆస్తులపై ఆధారపడతారు.

తుల: తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.  రాజకీయ పలుకుబడి కోసం, పదవికోసం విశేషంగా శ్రమించి కొంత లబ్ది పొందుతారు.వృత్తి ఉద్యోగాల పరంగా మీ వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి పెద్దవి కాకుండా మంచి మాటలతో సంజాయిషీ చెప్పుకుని, నష్టం కలుగకుండా జాగ్రత్తపడతారు. సీజనల్‌ వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌కు అధిక లాభాలు వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయంలో అసంతృప్తి ఉంటుంది. బిడ్డల కాపురాలు సరిదిద్దటానికి శ్రమిస్తారు. ధనం కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించటానికి దివారాత్రులు శ్రమిస్తారు. సంపాదనకు కొంత కాలం విరామం వచ్చినా వేచి ఉండాలి. కాలానికి ఎదురీదకూడదని గ్రహిస్తారు. ఆర్థికపరమైన అభివృద్ధి సాధించటానికి సరికొత్త వ్యూహాలను రూపొందిస్తారు.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మీకు ఇష్టం లేకపోయినా కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేస్తారు. వ్యాపారపరంగా మీరు పెట్టిన ఖర్చులు వృధాకావు. వాటిని పెట్టుబడిగా భావించండి. హోటల్‌ వ్యాపారంలో మార్పులు చేర్పులు లాభిస్తాయి. మ్యారేజీ బ్యూరో నడిపే వారికి బాగుంది. కూరగాయలు, టీ, కాఫీ, హోటల్‌ వ్యాపారస్తులకు చిల్లర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు కమీషన్‌ ఏజెంట్‌లకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఎంత శ్రమించినా గృహంలో అంతర్గత విభేదాలను సరిదిద్దలేరు. సంతానంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలుసుకుని ఊరట చెందుతారు. మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో కోర్టు వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి.కాంట్రాక్టుల తాలూకు బిల్లులు ఆలస్యం కావటంతో ఇబ్బంది పడతారు.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. పాస్‌పోర్ట్‌, వీసా, గ్రీన్‌కార్ట్‌ వంటివి లభిస్తాయి. విదేశాలలో నివసిస్తున్నవారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగపరంగా కీలకమైన బాధ్యతలు నిర్వహించవలసిన సీటుకు బదిలీ అవుతారు. అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. మీరు కోల్పోయినవన్నీ తిరిగి సాధిస్తారు. సమాజంలో మీ గుడ్ విల్‌ను నిలబెట్టు కుంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునేవారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైన సంబంధమే కుదురుతుంది. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాలు మార్చుకుంటే మేలు జరుగుతుంది. లేకపోతే జీవితంలో కొన్ని చేదు అనుభవాలని ఎదుర్కోవలసి వస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయి.ఆరోగ్యం మధ్యమధ్యలో నలతగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, కుడి మోకాలు నొప్పి, చెవి, ముక్కు గొంతు సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు.

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు అనుకున్న స్థాయిలో పురోగతిలో ఉంటాయి. కోర్టు వివాదాలు అంతిమ పరిష్కారం చూపిస్తాయి. వృత్తి ఉద్యోగాలపట్ల ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందరూ మీ తెలివితేటల్ని సామర్ద్యాన్ని మెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్య, సివిల్‌ సర్వీస్‌, పోటీపరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందాలని మీరు ఆశించినా, సానుకూలమైన వాతావరణం ఏర్పడినా కొంతమంది వ్యక్తులు అడ్డుపడటం జరుగుతుంది. న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలనలోకి వస్తాయి.  జ్యేష్టకుమారుని వలన కొన్ని ఇబ్బందులు ఎదరువుతాయి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. కొంత ఊరట అనేది కలుగుతుంది. మానసిక సంతోషానికి ఇదోక కారణం అవుతుంది. ఎగుమతి, దిగుమతి, వ్యాపారాలు డిస్ట్రిబ్యూషన్‌, రియల్‌ ఎస్టేట్‌, మొదలైన వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. లాభాలు రాకపోయినా పెట్టిన సొమ్ము వచ్చినందుకు సంతోష పడతారు.ఆర్థికంగా కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైనా ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో చేస్తున్న కృషికి సాధారణమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఊరట లభిస్తుంది. మీ పనితీరుని మెచ్చుకుంటూ అభినందన పత్రాలు చేతికి వస్తాయి.

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన అవకాశాలు కలిసివస్తాయి. పనిచేస్తున్న సంస్థలో మీకు ఉన్న విలువను మరింత పెంచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యం అనేది చాలా ముఖ్యమని భావిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనే మీ కోరిక ఇతరుల వల్ల నెరవేరుతుంది. మీరు అనుకున్నటువంటి జీవితాశయం ఏదైతే  ఉందో దానిని మీరు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారానికి అడ్డుగా ఉన్న అవరోధాలు అన్ని తొలగిపోతాయి. ఆస్తుల వివాదం కోర్టు పరిశీలనలో ఉంటుంది. భాగస్వాములలో అర్ధరహితమైన విభేదాలు వస్తాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News