మేషం – ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు, స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలుగుతాయి.
వృషభం – పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
మిథునం – పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం.
కర్కాటకం – వ్యవహారాలలో అరోధాలు ఏర్పడిన అధిగమిస్తారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
సింహం – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు.
కన్య – మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తసరం. అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తుంది .ఉద్యోగాలలో ఒత్తిడులు తొలుగును.
తుల – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి
వృశ్చికం – ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగించుకొంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.
ధనుస్సు – విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. బాకీలు వసులవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సోదరుల నుండి విలువైన సమాచారం అందును.
మకరం – కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిరకాల మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం – ఆర్థిక వ్యవహారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం.
మీనం – ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు.