టొరంటో: వచ్చే సెప్టెంబర్ 25-26 తేదీలలో కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు , 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తమ ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని తమకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోందని సదస్సు నిర్వాహకులు తెలిపారు. ఆయా వక్తలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (ఇఎస్టీ-టొరంటో సమయం) పొడిగించామని, మొత్తం 20 గంటలకి పైగా ఈ సదస్సు జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.
టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ అంతర్జాలంలో వీక్షించాలని సభ నిర్వాహకులు కోరారు.
ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున సాహిత్య సదస్సు నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటి సారి అని, ఈ సదస్సుని ఆసాంతం వీక్షించాలని వారు కోరారు. సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్వహకులు వెల్లడించారు.
రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు (ఇఎస్ టి, టొరంటో సమయం 9:00 AM-7:00 PM….ప్రతీ రోజూ)
• September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1
• September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS
ప్రతిష్టాత్మకమైన ఈ ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సు తాజా సమాచారం ఇక్కడ జతపరిచిన 3వ ప్రకటన లో ఛూడాలని వారు కోరారు. అంతే కాదు. త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలు ఈ క్రింది వీడియో లింక్ లలొ చూడవచ్చు. https://youtu.be/U4tX3dNHlKw సదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
• సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com
• వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, యుఎస్ఎ): vangurifoundation@gmail.com
• సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com; శాయి రాచకొండ (USA): sairacha@gmail.com
• కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల
• నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆట తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం
కెనడాలో తెలుగు సాహితీ సదస్సు….
- Advertisement -
- Advertisement -
- Advertisement -