Thursday, January 23, 2025

కాంగ్రెస్ హయాంలో అంధకారంలో తెలుగు రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

మణుగూరు : కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో రైతులు అందకారంలో ఉన్నారని, కరెంటు అందక ఎక్కడ చూసిన కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పంటలే కనపడేవని ప్రభుత్వ విప్, పినపాక ఎంఎల్ఎ రేగా కాంతారావు అన్నారు. బుదవారం మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆద్వర్యంలో మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు స్ధానిక సబ్ స్టెషన్ వద్ద టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిస్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా రేగా కాంతారావు మాట్లాడుతూ… రైతుల మేలుకోరేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉండాలనే లక్షంతో పంట పెట్టుబడి సాయం క్రింద రైతుభందు, చనిపోయిన రైతు కుటుంభాలకు రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల కరెంటు, రైతులు పండించిన దాన్యం ప్రభుత్వం పూర్తిస్ధాయిలో కోనుగోలు చేయడం వంటి పథకాలు చూసి కాంగ్రేస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌హ‌యాంలో రైతులు కరెంట్ ఎప్పుడు వస్తుందాని ఎదురుచూసేవారని, తెలంగాణ ఎర్పడిన తరువాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24గంటల కరెంటు అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో సాగు తెలియని రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. రైతుల పట్ల అనుచిత వాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిస్టిబోమ్మను దహనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పీటీసి పోశం నరసింహారావు, మండల అధ్యక్షులు ముత్యంబాబు, టౌన్ ప్రెసిడెంట్ అడపా అప్పారావు నాయకులు వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్, సాగర్ యాదవ్, తాత రమణ, ఎడ్ల శ్రీను, నవీన్ బాబు, పాయం ప్రవీణ్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News