మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా ఓటు వేస్తున్నారా ? ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రక్రియ ఏమిటీ? అసలు ఈవిఎం మిషన్లు అంటే ఏమిటీ? వివి ప్యాట్ అంటే ఏమిటి అన్న సందేహాలు చాలా మంది ఓటర్లలో తలెత్తుతుంటాయి. నేడు ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈ సారి చాలా మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో చాలామంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
పోలింగ్ స్టేషన్, బూత్‌ను కనుగొనడానికి వెబ్‌సైట్…
ఓటర్లు తమ పోలింగ్ బూత్‌ను కనుగొనడానికి electoralsearch.inకి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి అడగవచ్చు. పోలింగ్ స్టేషన్కు వెళ్లే ముందు ఓటర్ ఐడీ లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి. మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళతారు. ఒక వేళ మీకు ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ బూత్ కౌంటర్‌లో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్ల వద్ద పొందవచ్చు. పోలింగ్ స్టేషన్లో మెుదటి అధికారి ఓటరు జాబితాలో, గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. మూడో అధికారి ఆ చీటిని చెక్ చేస్తారు. అప్పుడు మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రిసైడిండ్ అధికారి, పోలింగ్ అధికారి బటన్ నొక్కడం ద్వారా ఈవిఎం యంత్రంపై మీరు ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
బటన్ నొక్కగానే బీప్ శబ్ధం
మీరు ఈవిఎం యంత్రం ఏర్పాటు చేసిన నిర్ధేశిత ప్రదేశానికి వెళ్లగానే అక్కడ ఈవిఎం బ్యాలెట్ అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు కనిపిస్తాయి. ఈవిఎంలో మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్ నొక్కాలి. అప్పుడు దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడంతో పాటు బీప్ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క. మీరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఈవిఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్(వివిప్యాట్) వద్ద దాన్ని చూడవచ్చు. సీల్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఎవరికి ఓటు వేశామో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. ఒకవేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా బదులుగా బీప్ సౌండ్ వినిపించకపోయినా మీరు ప