Monday, December 23, 2024

లండన్‌లో తెలుగు విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

లండన్‌లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన దేవులపల్లి రమేష్ -రజితల కుమారుడు దేవులపల్లి ప్రణయ్ ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం లండన్ వెళ్ళాడు. లండన్‌లో ప్రణయ్ 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆసు పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందినట్లు స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందింది. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు రజిత రమేష్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News