Monday, December 23, 2024

అమెరికాలో జలపాతంలో పడి తెలుగు విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ట్రైనే యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు న్యూయార్క్‌లోని బార్బెర్‌విల్లే జలపాతంలో పడి మరణించాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్‌గా న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ గుర్తించారు.

జులై 7న ఈ దుర్ఘటన జరిగింది. అల్బానీలోని బార్బెర్‌విల్లె వాటర్‌ఫాల్స్‌లో మునిగి మరణించినట్లు ఇక్కడి ఇండియన్ ఎంబసీ తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియచేసింది. అవినాష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News