Friday, February 7, 2025

న్యూయార్క్లో తెలుగు విద్యార్థి సూసైడ్..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుమ్మేటి సాయికుమార్‌ రెడ్డి అనే యువకుడు పై చదువుల కోసం యుఎస్ కు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఉంటున్న సాయికుమార్.. ఓ వైపు చదువుతూనే.. మరోవైపు న్యూయార్క్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్ చేస్తున్నాడు.అయితే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంతో.. చదువుల కోసం వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశి విద్యార్థులను వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్‌ రెడ్డి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన అతను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మ‌హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, సాయికుమార్ ఆత్మహత్య గురించి కుటుంబ సబ్యులకు సమాచారం అందలేదని అతని స్నేహితులు చెబుతున్నారు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉండటంతో..అతని తల్లిదండ్రులకు ఎలా సమాచారం ఇవ్వాలో తెలియక స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆత్మహత్య విషయాన్ని అమెరికా నుంచి తెలుగు మీడియాకు స్నేహితులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News