Monday, January 20, 2025

పిడుగుపాటుకు గురై ప్రాణాలతో బయటపడిన తెలుగు విద్యార్థిని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురై కొమా లోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గత పది రోజులుగా కోమా లో ఉన్న విద్యార్థిని కోమా నుంచి బయటకు వచ్చినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన సుశ్రూణ్య కోడురూ అమెరికాలో స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చదువుతోంది.

జులై 18న తన స్నేహితులతో కలిసి పార్కులో నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగుపాటుకు గురైంది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. వేంటనే స్నేహితులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ కోమా నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News