Wednesday, January 22, 2025

తెలుగు విద్యార్థుల ‘జైఇఇ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో మొత్తంగా 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) వెల్లడించింది. వారిలో తెలుగు విద్యార్థులు అభినవ చౌదరి, మాజేటి అభినీత్, దుగ్గినేని యోగేశ్, గుత్తికొండ అభిరా మ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు. జెఇఇ మెయిన్ 2023 తొలి విడత ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సోమవారం ఉదయం తుది కీ ని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఉదయం పేపర్ 1(బిఇ/బి.టెక్) ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసిన స్కోర్ కార్డును పొందవచ్చు.

పరీక్ష రాసిన 8,23,967 మంది విద్యార్థులు

జెఇఇ మెయిన్ – 2023 తొలి విడత పరీక్షలను ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవిదేశాలలో 287 నగరాలలో 574 పరీక్షా కేంద్రాలలో నిర్వహించా రు. వివిధ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీ క్షలు రాయడానికి దేశ వ్యాప్తంగా 8,60,064 మంది దరఖాస్తు చేసుకోగా, 8,23,967 (95.80 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6 లక్షల మందికి పైగా అమ్మాయిలు, 6 లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు.

అలాగే, పేపర్ 2 (బీ.ఆర్క్/ బీ.ప్లానింగ్) పరీక్షను 46 వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25 వేల మంది అబ్బాయిలు, 21 వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.2 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు

1. గుల్షన్ కుమార్
2. డిఎన్‌యానేష్ హేమంద్ర షిండే
3. దేశాంక్ ప్రతాప్‌సింగ్
4. సోహం దాస్
5. వావిలాల చిద్విలాస్ రెడ్డి
6. అపూర్వ సమోట
7. దుగ్గినేని వెంకట యుగేష్
8. గుత్తికొండ అభిరామ్
9. ఎన్.కె.విశ్వజిత్
10. నిపున్ గోయల్
11. రిషి కల్రా
12. మయాంక్ సోని
13. క్రిష్ గుప్త
14. సుత్తార్ హర్షుల్ సంజా భాయ్
15. బిక్కిన అభినవ్ చౌదరి
16. అమోగ్ జలాన్
17. అభిజీత్ మజేటి
18. ధ్రువ్ సంజయ్ జైన్
19. ఆషిక్ స్టెన్నీ
20. కౌశల్ విజయ్‌వెర్జియా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News