Thursday, January 23, 2025

జెఇఇ మెయిన్స్ లో తెలుగు విద్యార్థుల హవా…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: జెఇఇ మెయిన్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించి జెఇఇ మెయిన్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా వంద శాతం స్కోరు సాధించిన విద్యార్థులు 23 మంది ఉండగా తెలుగు విద్యార్థులు పది మంది ఉండడం మనకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్లూరి శ్రియాషష్, తవ్వ దినేశ్ రెడ్డి, మదినేని వెంకట సాయి తేజ, రిషి శేఖర్ శుక్లా, హుందేకర్ విదిత్, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తోట సాయి కార్తీక్, షేక్ సూరజ్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి వంది శాతం స్కోరు సాధించారు.

జెఇఇ మెయిన్ తొలి విడత పేపర్- దేశ వ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండో విడత ఏప్రిల్ రె4 నుంచి 15 వరకు నిర్వహించామని నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ వెల్లడించింది. తొలి విడత రాసిన విద్యార్థులు, రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు, రెండింటిలోనూ ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News