Sunday, January 12, 2025

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

లండన్‌లో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం బోధవాడకు చెందిన పంగులూరు చిరంజీవి(32) కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిరంజీవి.. కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన చిరంజీవి మరణించగా.. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News