Saturday, January 11, 2025

అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు..మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరో తెలుగు యువకుడు మృాతి చెందాడు. డల్లాస్ లోని ఓ స్టోర్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపీకృష్ణ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ గోపీ చనిపోయాడు.

గోపీ స్వస్థలం బాపట్ల జిల్లా యాజలి. ఎంఎస్ చదివేందుకు యుఎస్ వెళ్లిన గోపీ..కోర్సు పూర్తి కావడంతో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా గోపీ మృతదేహాన్ని యాజలి గ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News