Wednesday, January 22, 2025

సీరియల్ నటి ప్రియుడితో కలిసి భర్తను చంపాలని… గొంతుకోసి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ సీరియల్ నటి ప్రియుడితో కలిసి భర్తను హత్యాయత్నం చేసిన సంఘటన తమిళనాడులో చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగౌండన్‌కు చెందిన రమ్య తమిళ సీరియల్ నటిస్తుంది. ఆమె సుందరి, కన్నెదిరే తొండ్రినాల్ అనే సీరియల్ నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. నటి రమ్య తన రమేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టింది. దీంతో రమేష్ కిందపడగానే మరో వ్యక్తి బ్లేడ్‌తో గొంతు కోశాడు. దీంతో వెంటనే రమేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. రమ్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి.

రమ్య టివి సీరియల్‌లో నటించి రమేష్‌కు ఇష్టం లేకపోవడంతో ఇద్దరు మధ్యల గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఇదే సమయంలో రమ్యతో మరో నటుడు డేనియల్ అలియాస్ చంద్రరశేఖర్ పరిచయం ఏర్పడడంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరు కలిసి భర్తను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా రమ్య తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి చంద్రశేఖర్ ఢీకొడుతాడు. అనంతరం కిందపడగానే కత్తితో రమేష్ గొంతు కోస్తాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి కోయంబత్తూరు జైలు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News