- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరువవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4డిగ్రీలకు చేరుకుంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ అని అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు మరింత తక్కవకు పడిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16నుంచి దక్షిణభారంతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. తమిళనాడులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కేరళలో కూడా ఈ నెల17న వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కిందిస్థాయిలో గాలులు తూర్పు,ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్టంవైపునకు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటలు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకునే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
- Advertisement -