మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు దక్షిణ దిశ నుండి వీస్తున్నాయి. రాష్ట్రంలో పొడి వాతవరణం నెలకుంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రాగల 24గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతవారణం నెలకుని ఉంటుంది. గరిష్ఠ కనిష్ట ఉష్ణోగ్రతలు 38నుంచి 26డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వివరించింది.
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నిర్మల్, నల్లగొండ జిల్లాల్లో 41 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, నిజామబాద్ జిల్లాల్లో 40.9డగ్రీలు , నమోదయ్యాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, మేడ్చెల్ మల్కాజిగిరిలో 40.7డిగ్రీలు, కుమరం భీం ,భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 40.6 డిగ్రీలు , సిద్దిపేట హైదరాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మెదక్, హనుమకొండ జిల్లాల్లో 40.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.