- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. శుక్రవారం సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9, హాజీపూర్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎండలు మండిపోవడంతో జనాలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జనాలు ఎండలో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులు కిత్రం వరకు వర్షాలు కురిశాయి. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచి కొడుతుండడంతో జనాలు బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.
- Advertisement -