Friday, January 24, 2025

దామరచర్ల @ హూళెగీలు

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో ఎండలు మళ్లీ భగ్గుమన్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటిపోయాయి. రాష్ట్రంలో అ త్యధికంగా నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 46.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, తంగుళ్లలో 45.9, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.7, కొ మరంభీం జిల్లా జంబుగలో 45.6, జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.6 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కిందిస్థాయిలో గాలులు వాయువ్య, దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. రాగల మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీల నుంచి 44డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉ న్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో చు ట్టుపక్క పగటి ఉష్ణోగ్రతలు వరకూ నమోదయ్యే అవకాశాలు ఉ న్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News