అప్పుడే 40డిగ్రీల చేరుకున్న ఉష్ణోగ్రత
బయటికీ రావాలంటేనే జంకుతున్న ప్రజలు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: భానుడి భగభగలతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. గత 4 రోజులుగా సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు4డిగ్రీలకు పైగా అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో ముదిరిన ఎండలు అప్పుడే మండు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో ఉదయం 10 దాటి తర్వాత బయటికి వచ్చేందుకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మార్చిలోనే రెండు వారాల్లో 40 డిగ్రీలకు చేరుకున్న ఎండల తీవ్రత ఇంకా ఏఫ్రిల్, మే మాసాలల్లో ఏలా ఉంటుందోనని ప్రజలు వణికి పోతున్నారు. ఎండల తీవ్రత రోజు రోజుకు అంతకంతా పెరుగుతుండడంతో వడగాల్పులు సైతం ప్రారంభ కావడంతో సిటీ జనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. పెరిగిన ఎండల కారణంగా ఉద్యోగులు,రోజు వారి కూలీలకు కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది.నగరంలో వాహనాల పోగ వేడిమితో మరో రెండు డిగ్రీల వేడిమికి కారణమవుతున్నాయి. వీటికి తోడు కార్పొరేటు కార్యాలయాలు, బడ బడా మాల్స్, కార్లలో ఎసి వినియోగిస్తుండడంతో బయట మరింత వేడి పెరుగుతోంది. మాధ్యాహ్నవేళాల్లో సిగ్నల్స్ పడితే కార్లతో పాటు రోడ్డు వేడిమితో ద్విచక్ర వాహనాదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఏడాది ఎండలు తీవ్రత అధికం:
ఈ ఏడాది వేసవికాలంలో ఎండల తీవ్రత అధికం ఉంటే అవకాశం ముంది. వారంలో ఎండలు మరింత తీవ్రం కావడంతో పాటు రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు కూడ వీచే అవకాశాలున్నట్లు వాతవరణ శాఖ పేర్కొంది. అప్పడే పగటి ఉషోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 శాతం అధికం నమోదు అవుతుండడంతో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. పోడి వాతావరణం కారణంగా రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయి. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రతలు పాటిస్తే దాదాపు వేసవిలో వచ్చే రుగ్మతలను అధిగమించవచ్చు. లేకపోతే ఒకోక్కసారి ప్రాణప్రాయస్థితికి చేరుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా వృద్దులు, మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకు ఎండలు అధికంగా ఉన్న సమయంలో తప్పని పరిస్థితులో బయటికి వేళ్లాల్సి వస్తే కాస్త రక్షణ చర్యలు తీసుకుంటే ఎండ నుంచి తప్పించుకోవచ్చాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రతలు:
సాధ్యమైనంత వరకు ఎండల్లో తిరగ కూడదు.
ఒక్కరు నూలు వస్త్రాలు ధరించడం మంచింది.
11నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాకపోవడమే మేలు.
తలకు లేతరంగు టోపితో పాటు వదలు దుస్తువులను ధరించి వెళ్లడం మంచింది.
ఇంటి నుంచి బయలుదేరే ముందు తగినన్ని నీళ్లు తాగడంతో పాటు వెంట నీరు తీసుకుపోవడం ఉత్తమం.
ఎట్టి పరిస్థితులోను పిల్లలు ఆడకుండా చూసుకోవాలి.
బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నీరు తాగరాదు.
కొంత విశ్రాంతి తర్వాత నీరు తీసుకోవాలి.
వడదెబ్బ నివారణ:
ఎండల కారణంగా ఆనారోగ్యులతో పాటు వృద్దులు, పిల్లలు వడదెబ్బ తగలే అవకాశం అధికంగా ఉండడంతో వీరు బయటికి రాకపోవడం మంచింది.
వడదెబ్బ తగిలినా, ఆ వ్యక్తిని వెంటనే చల్లని నీడ ప్రదేశానికి తీసుకుని వెళ్లాలి.
వదులు చేసి గాలి సోకేలా చర్యలు చేపట్టాలి.
వెంటనే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఆందుబాటులో ఉంటే మంచినీటిలో కలిపి అందించాలి.
వీటికి తోడు గంజి, మజ్జిగలో చిటెకడు ఉప్పు పంచదార కలిపి తాగించాలి.
ఆ వ్యక్తి కొలుకోలేకపోతే వెంటనే సమీపంలోని వైద్యశాలకు తీసుకువెళ్లాలి.