Friday, November 22, 2024

వణుకుతున్న ఉత్తర తెలంగాణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరా బాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటుం దని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గుముఖం పట్టాయన్నారు. తెల్లవారుజామున 4.30 నుంచి దట్టమైన పొగ మంచు కప్పేస్తుందన్నారు. చలి నుంచి వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గోరు వెచ్చని నీళ్లు తాగడంతో పాటు ముదురు రంగు దుస్తులు ధరించాలని సూచించారు.

ఢిల్లీ బాటలోహైదరాబాద్
అటు కాలుష్యం.. ఇటు పొగమంచుతో ఢిల్లీ బాటలో హైదరాబాద్ పయనిస్తోంది. కాలుష్యంతో భాగ్యనగరంలో గాలి నాణ్యత తగ్గిపోతోంది. నగ రంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200మార్క్‌ని దాటేసింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పొగమంచు, కాలుష్యంతో హైదరా బాద్‌పై స్మాగ్ పడగ విప్పింది. కాలుష్యానికి పొగమంచు తోడైతే స్మాగ్ ఏర్పడుతుందని,

స్మాగ్‌లో నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి హానికర రసాయ నాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే పదేళ్లలో గ్యాస్ ఛాంబర్‌లా హైదరాబాద్ మారుతుందని అంటున్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చలి వల్ల పెరుగుతున్న పొగమంచుకి ఇది తోడై, నగరంలో స్మాగ్ ఏర్పడుతోంది. దీనివల్ల వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ ఇనెఫెక్షన్స్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదమూ లేక పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News