Sunday, January 19, 2025

చండ ప్రచండం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో 49డిగ్రీలు

మండు వేసవిలో ఉత్తర భారతం.. వడగాల్పులతో జనం బెంబేలు

న్యూఢిల్లీ : ఉత్తరభారతదేశం అత్యంత తీవ్రస్థాయి వేసవితాపంతో అట్టుడికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వేసవితీవ్రతతో వడగాడ్పులు వీస్తూ ఉండటంతో జనం బేంబేలెత్తుతున్నారు. ఢిల్లీ 49 డిగ్రీలు దాటి 50 డిగ్రీలస్థాయికి చేరుకొంటోందని వాతావరణ శాఖ వెలువరించిన ఉష్ణోగ్రతల రికార్డులతో వెల్లడైంది. హర్యానాలోని గురేగావ్‌లో 48.1 డిగ్రీలు నమోదైంది. 1966 మే తరువాత ఇది అత్యధికం. అప్పట్లో నగరంలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరింది. ఉత్తర భారతంలోని అన్ని ఐఎండి కేంద్రాలలోనూ ఇంతకు ముందెప్పుడూ లేని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు చోటుచేసుకున్నాయి. సోమవారం దేశ రాజధానిలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని, దీనితో వేసవి తాపం కొంతమేర శాంతిస్తుందని ఐఎండి తెలిపింది. పంజాబ్‌లోని ముక్తసర్‌లో ఉష్ణోగ్రతలు 47.4 డిగ్రీలు దాటాయి. హర్యానాలో పలు ప్రాంతాలలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News