- Advertisement -
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు పడనుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు తెలిపింది. దీంతో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మరోవైపు, దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వానలు పడే చాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి వానలు పడతాయని అంచనా వేసింది.
- Advertisement -