Thursday, February 6, 2025

ఫిబ్రవరి తొలి వారంలోనే భానుడి భగభగలు

- Advertisement -
- Advertisement -

వాతావరణ మార్పుతో ఒక్కసారిగా
పెరిగిన ఉష్ణోగ్రతలు భద్రాచలంలో
అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్‌లో 34.2 డిగ్రీలు,
ఖమ్మంలో 36 డిగ్రీలు నిజామాబాద్,
రామగుండం, మహబూబ్‌నగర్‌లోనూ
సూర్య ప్రతాపం ఫిబ్రవరిలోనే మే
నెల ఎండలు మరో నాలుగు
రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం
రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పగ టి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి తొలి వారంలోనే ప్ర తాపం చూపిస్తున్నాయి. గత వారం వరకు చ లిగాలుల ధాటికి వణికిపోయిన జనం గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతల పె రుగుదలలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతోఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాతావరణం లో తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో 32 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదు అవుతున్నాయి. వేసవి రాకముందే భానుడి ప్రతాపం క్రమేణా పెరుగుతోంది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బుధవారం భద్రాచలంలో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 34.2 డిగ్రీలు, హన్మకొండ 33, నిజామాబాద్ 34.4, ఆదిలాబాద్ 35.8, భద్రాచలం 37.0, ఖమ్మం 36.6, మహబూబ్‌నగర్ 36.3, మెదక్ 35.6, నల్గొండ 32.5, నిజామాబాద్ 35.5, రామగుండంలో 35, హయత్‌నగర్ 34.2, పటాన్‌చెరు 34.4, రాజేంద్రనగర్ 34.5 డిగ్రీలు నమోదయ్యాయి.

మే నెలలో ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదు
సాధారణంగా మార్చి నుంచి మే వరకు ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణాగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం సమయాల్లో ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీలు దాటుతుండటం ప్రజలను హడలెత్తిస్తోంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణం పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయం వైపు నుంచి వేడి గాలులు వీస్తుండటంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 15 నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుందని జనవరి నెలలోనే వాతావరణ శాఖ సూచన చేసింది. తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని పేర్కొంది. ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత క్రమేణా పెరుగుతుందని స్పష్టం చేసింది.

రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ క్రమేణా పెరుగుదల
ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 32 నుంచి 37 డిగ్రీలు వరుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావం రాత్రి ఉష్ణోగ్రతలపైనా కనిపిస్తోంది. వాతావరణంలో చలి తగ్గి వేడి పెరుగుతోంది. దీంతో ప్రజలు ఏసిలు, కూలర్లను వినియోగించడం ప్రారంభించారు. నిన్నటి వరకూ చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా రాత్రి ఉక్కపోతకు గురవుతున్నారు. పగలు ఉదయం పది గంటల నుంచే ఎండల తీవత్ర పెరుగుతోంది. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గకపోవడంతో హైదరాబాద్‌లో అనేక రహదారులు మధ్యాహ్నం సమయానికి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News