Sunday, December 22, 2024

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటల తర్వాత కూడా ప్రభావం అలాగే ఉంది. దీంతో రోడ్ల పైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో సాధారణ, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిం చారు. 2024 జనవరి సీజన్‌లో హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, అయితే ఈసారి అది మరింత తక్కువగా ఉండే అవ కాశం ఉందని భారత మెట్రాలజీ విభాగం స్పష్టం చేసింది. ఇక.. ఈసారి ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధు లు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడంతో పాటు రక్తం గడ్డ కట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వేడి పదార్థాలనే ఆహారంగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వండుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒక సారైనా బాడీ చెకప్ చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News