Monday, December 23, 2024

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాగల రెండు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనున్నట్టు తెలిపింది. కొరిమన్ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ ,అంతర్గత కర్ణాటక మీదుగా కొంకన్ గోవా వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి తెలంగాణ రాష్ట్రానికి దూరంగా కదిలిపోయిందని తెలిపింది.

తెలంగాణలో క్రిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నట్టు తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్ మండలం అర్లిలో 5.5 మిల్లీమీటర్లు, తామ్సిలో 4.3, కామారెడ్డి జిల్లా తాడ్వాయ్‌లో 3.3 మి.మి వర్షం కురిసింది. కాగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో 42.7 డిగ్రీలు నమోదైంది. మహబూబాబాద్,మంచిర్యాల, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాలలో 42.5డిగ్రీలు నమోదైంది. మరికోన్ని ప్రాంతాల్లో కూడా 42డిగ్రీల పైగానే నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News