Friday, December 20, 2024

‘సీతమ్మవారి జన్మస్థలంలో ఆలయం నిర్మిస్తాం’

- Advertisement -
- Advertisement -

సీతామఢిలో అమిత్ షా ప్రకటన

సీతామఢి: బీహార్‌లోని సీతామఢిలో సీతమ్మవారి కోసం ఒక బహ్మాండమైన ఆలయాన్ని బిజెపి నిర్మిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ సా గురువారం ప్రకటించారు. సీతామఢిలో గురువారం ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ బిజెపి ఓటు బ్యాంకుకు భయపడదని చెప్పారు. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రామాలయాన్ని నిర్మించారని, ఇక సీతమ్మవారి జన్మస్థానంలో ఆమెకు ఒక గొప్ప స్మారకాన్ని నిర్మించవలసి ఉందని ఆయన చెప్పారు. రామాలయానికి దూరంగా ఉన్నవారు ఈ పనిచేయలేరని, సీతమ్మవారి జీవితం తరహాలోనే ఆదర్శవంతమైన ఆలయాన్ని నిర్మించగల శక్తి ప్రధాని మోడీకి, బిజెపికి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

బీహార్‌లోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన సీతామఢిలో మే 30న ఐదవ దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇండియా కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై అమిత్ షా ధ్వజమెత్తుతూ తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేందుకు లాలూ నేడు వెనుబడిన తరగతులను వ్యతిరేకించే కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారని ఆరోపించారు.

వెనుకబడిన తరగతుల కోసం పాటుపడిన బీహార్ మాజీ ముఖ్యమత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్‌జెడి ఎన్నడూ భావించలేదని, కాని మోడీ ప్రభుత్వం ఆ పని చేసిందని అమిత్ షా చెప్పారు. బీహార్‌కు వికాస్‌రాజ్ అవసరమని జంగల్‌రాజ్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News