Sunday, December 22, 2024

ఏపిలో మందిర రథం దగ్ధం..ఐదుగురు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: జిల్లాలోని హనుమంతుడి గుడి రథాన్నిమంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అయితే ఐదుగురు వ్యక్తులను ఈ విషయంలో అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి. జగదీశ్ ఇది మత విద్వేష ఘటన కాదన్నారు. ఓ వర్గం లోని రెండు గ్రూపుల మధ్య వాగ్వివాద ఫలితంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.

పోలీసుల కథనం ప్రకారం రెండు వర్గాల వారు పబ్లిక్ ప్లేస్ లో రథం పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. అయితే దాతలు ఆ రథాన్ని తమ ఇంట్లో పెట్లుకోవాలని అన్నారు.

అయితే చర్చల అనంతరం రథం ఉంచడానికి ఓ షెడ్ నిర్మించేందుకు అంగీకారం కుదిరిందని, కానీ మంగళవారం తెల్లవారు జామున ఎవరో తగులబెట్టారు. దాంతో ఐదుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వివాదం వెనుక ఉన్న రెండు పక్షాల వారే కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై మంగళవారం ఓ ఫిర్యాదు నమోదయింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. దర్యాప్తు జరిపి నేరస్థులను అరెస్టు చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News