Wednesday, November 6, 2024

ఆలయ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

రుద్రూరు : రుద్రూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామాలయ గర్భగుడి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టించే నూతన విగ్రహాలతోపాటు ధ్వజ స్తంభ ఏర్పాటు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన సీతారామ ఆలయ నిర్మాణం కోసం రూ.45లక్షలు మంజూరు చేశామన్నారు. ఆలయ నిర్మాణానికి గాను రూ.45లక్షలు సరిపోవని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా అదనంగా మరో రూ.10లక్షలు మంజూరుచేశారు. ఆలయ నిర్మాణం కోసం డబ్బులు వృథా చేయకుండా అవసరాల నిమిత్తం ఖర్చుచేయాలని సూచించారు. నూతన విగ్రహాల స్థాపన ఖర్చును ధ్వజ స్తంభ ఖర్చుల వివరాలను కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సీతారామ ఆలయం కోసం ప్రతి ఒక్కరు సహకరించుకొని నిర్మించుకోవాలని కోరారు.

సీతారామ ఆలయ ప్రహరీ గోడ కోసం 10లక్షలు మంజూరు చేశారు. మొత్తం 55లక్షలతో పాటు చందాల రూపంలో వసూలు చేసిన డబ్బులతో ఆలయాన్ని సుందరంగా నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, వైస్ ఎంపిపి నాట్కరి సాయిలు, రుద్రూర్ సింగిల్ విండో ఛైర్మన్ బద్దం సంజీవ్‌రెడ్డి, మాజీ విండో అధ్యక్షుడు పత్తి రాము, ఆలయ కమిటీ అధ్యక్షులు పత్తి నవీన్, అడప నవీన్, గ్రామ పెద్దలు బేజగం వెంకటేశం, డౌర్ సాయిలు, వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News