Monday, December 23, 2024

ఆదరణకు నోచుకోని దేవాలయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ రాజులు గుళ్ళు, గోపురాలు, చెరువులు, నిర్మించి ప్రజలకు, భక్తి భావంతో పాటు ప్రజలకు ఎన్నో మేలు పనులు గావించారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నెలకొని ఉంది. ప్రతాపరుద్ర చక్రవర్తికి ఇద్దరు చెల్లెళ్లు పెద్ద మూపాంబిక, చిన్న మూపాంబిక ఉండేటివారు. వారి పేర్లతో పెద్ద ముప్పారం, చిన్న ముప్పారం పేర్లతో గ్రామాలు వెలిసినవి.

చిన్న మూపాంబిక చెన్న కేశవ భక్తురాలు. ఈ గ్రామంలో దాదాపు 830 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆమె నిర్మించింది.ఈ దేవాలయం పై ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ తరువాత ప్రక్క గ్రామం కోమటి పల్లి గ్రామం లో తమిళనాడులోని శ్రీవైష్ణవ దివ్య క్షేత్రం నుంచి వలస వచ్చి శ్రీవైష్ణవ మత వ్యాప్తికి పాటుపడిన శ్రీ వేదవ్యాస, శ్రీ పరాశర భట్టర్ వంశస్తులు వారి కుల దైవం కూరత్తాళ్వార్ వారి విగ్రహం స్థాపించారు. శ్రీ కూరత్తాళ్వార్ వారి విగ్రహం ప్రపంచంలో కేవలం తమిళనాడు లోని కాంచీ పురం, శ్రీరంగం లోనే ఉన్నవి.

మరల శ్రీ కూరత్తాళ్వార్ విగ్రహం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కేవలం చిన్న ముప్పారం గ్రామంలో ఉండటం విశేషం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న దేవాలయం నేడు ఎటువంటి ఆదరణ లేక శిథిలావస్థలో ఉంది. దేవాలయ శాఖ వారి నుంచి ప్రతి నెల ధూప,నైవేద్యాలకు మాత్రమే నగదు వస్తుంది. ఈ గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు కొంత మంది దేవాలయాభివృద్ది కొరకు ముందుకు వచ్చినను, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందుటలేదు. ప్రభుత్వాలు యాదాద్రి, కొండగట్టు, వేములవాడ లాంటి పుణ్య క్షేతాలు అభివృద్ధి చేసినట్లుగా ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదే.

ఆళవందార్ వేణు మాధవ్
8686051752

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News