Sunday, December 22, 2024

సమంతకు గుడి.. ఎక్కడో తెలుసా?

- Advertisement -
- Advertisement -

అభిమానులు తమకు నచ్చిన హీరోయిన్లు, హీరోలపై తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ వీరాభిమాని గుడి కడుతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ తన ఇంట్లోనే గుడి నిర్మించి అందులో ఆమె విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Also read: ‘మంగళవారం’ సినిమాలో ‘శైలజ’గా పాయల్ రాజ్‌పుత్

ఎల్లుండి సమంత పుట్టినరోజు నాటికి దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న సందర్భంగా సందీప్ ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దుర్గా దైవక్షేత్రాల్లో సర్వమత మొక్కుబడల యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లలో కుష్బూ, నమితకు అభిమానులు గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు సామ్ కు గుడి కట్టడం విశేషం.  భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘శాకుంతలం’ సినిమా తన అభిమానులను నిరాశ పరిచింది. సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తూ బిజీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News