Sunday, December 22, 2024

పాల్వంచలో దేవుడి సొమ్ముకు శఠగోపం?!

- Advertisement -
- Advertisement -

జాయింట్ అకౌంట్‌లో సొమ్ము రూ.9లక్షలు సొంత ఖాతాకు బదిలీ
కలెక్టర్‌కు ఫిర్యాదు
విచారణ ప్రారంభించిన పోలీసులు

మన తెలంగాణ/కొత్తగూడెం : పాల్వంచ అంటేనే అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడ దేన్ని వదలని పరిస్థితి. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావుకు సన్నిహితుడు, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను తప్పించిన కేసులో నిందితుడు చావా శ్రీనివాసరావు పాల్వంచలోని ఒక బ్యాంకులో జాయింట్ ఎకౌంట్‌లో దాచిన దేవుడి సొమ్మును వేరే ఖాతాలోకి మళ్లించుకున్నారు. దీనితో దేవుడి సొమ్ముకు రెక్కలు వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచలోని సదరు బ్యాంకు మేనేజర్‌ను మచ్చిక చేసుకుని ఆఖాతాలో ఉన్న సుమారు రూ.9 లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకున్న జాయింట్ ఖాతాదారుల్లో ఒకరు తిరిగి ఆ సొమ్ము బ్యాంకులో జమ చేయకపోవటంతో సదరు బ్యాంకు మేనేజర్ పరిస్ధితి అడకత్తెరలో పొకచెక్కలా మారింది. దీనితో ఏం చేయాలో దిక్కుతోచక ఆ మేనేజర్ కొట్టుమిట్టాడుతున్నారు. 2019 నుంచి సాగుతున్న ఈ వ్యవహారం సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది. పాల్వంచలోని కాంట్రాక్టర్స్‌కాలనీలో గత 12 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో మిగిలిన డబ్బులు రూ.10 వేలు తను. చావా శ్రీనివాసరావు పేరున పాల్వంచలోని ఒక బ్యాంకులో జాయింట్ ఖాతా తెరిచి అందులో జమచేశామని పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీ కి చెందిన గంటేటి వెంకటేశ్వరరావు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం 2019నవంబర్ 16న ఇదే జాయింట్ ఎకౌంట్‌లో రూ 9,24,850 జమచేశామని వివరించారు. ఆ డబ్బులు అదే నెలలో 29వ తేదీన చావా శ్రీనివాసరావు తన సంతకం లేకుండా లేదా తన సంతకం ఫోర్జరి చేసి (అనుమానం) అందులో రూ.9 లక్షలు భద్రాద్రి స్టోన్ క్రషర్స్ ఖాతాలోకి మళ్లించుకున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలు కలెక్టర్‌కిచ్చిన ఫిర్యాదుతో జత చేశారు. ఇదేమిటను అడుగగా ఎమ్మెల్మే కుమారుడు వద్ద సెటిల్ చేస్తానని చెప్పి ఇప్పటికి మూడు ఏళ్లుగా గడుపుతున్నాడని వివరించారు. దయచేసి విచారణ జరిపి ఈ సొమ్ము సదరు జాయింట్ ఎకౌంట్‌లోకి వచ్చేలా చూడాలని ఆ వినతిపత్రంలో కోరారు. సదరు బ్యాంకు ఖాతా వివరాలు జత చేశారు. కాగా కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పాల్వంచ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను నుంచి ఒక ఏఎస్‌ఐ వచ్చి వివరాలు సేకరించుకుని స్టేట్‌మెంట్ రాసుకుని వెళ్లారని వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా గతంలో తాము పాల్వంచ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని, తామే చావా శ్రీనివాసరావుపై దాడికి వెళ్లినట్లు కేసు నమోదైందని, ఇప్పుడైనా కొత్త ఏఎస్పీ గా రోహిత్‌రాజు రావటంతో తమకు న్యాయం జరుగుతుందని ధైర్యం వచ్చిందని వెంకటేశ్వరరావు చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీనివాసరావు మాట నమ్మి ఆబ్యాంకు మేనేజర్ మరో ఖాతాదారుడు వెంకటేశ్వరరావు లేకుండా ఆ డబ్బులు భద్రాద్రి స్టోన్ క్రషర్స్ ఖాతాలోకి మళ్లించారు. అయితే ఈ మేనేజర్ పాల్వంచ నుంచి హైదరాబాద్ బదిలీ అయ్యారు. అక్కడి నుంచి పలువురు పెద్దల ద్వారా ఎమ్మెల్యే కు ఈ డబ్బులు విషయం పరిష్కరించాలని మేనేజర్ చెప్పించారని, ఎమ్మెల్యే ను ప్రాధేయపడ్డా పనికాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేనేజర్ చాలా ఇబ్బందులో ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో ఆయన ఇబ్బంది పడుతున్నారని ఈ డబ్బులు కోసం పలు మార్లు ఆయన శ్రీనివాసరావును సైతం బతిమిలాడినా ఫలితం లేదని తెలిసింది. ఇలా డబ్బులు జాయింట్ ఎకౌంట్‌లో ఉన్న డబ్బులు ఖాతాదారుల్లో ఒకరు లేకుండా ఇలా ట్రాన్స్‌ఫర్ చేయడం తన తప్పిదమే అని మేనేజర్ వాపోతున్నారు.. సొమ్ము జమకాకపోతే తన పరిస్థితి ఏమవుతుందో నని ఆయన మనోవేదనలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News