Monday, December 23, 2024

హయత్ నగర్ లో పూజారి అనుమానాస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

Temple priest suspicious death in Hayath Nagar

హైదరాబాద్: హయత్ నగర్ లోని విద్యానగర్ కాలనీలో పూజారి అనుమానాస్పదంగా మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తితో కలిసి షణ్ముఖ శాస్త్రీ అనే పూజారి కారులో వెళ్లారు. అదే కారులో సోమవారం పూజారి అనుమానాస్పదంగా శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూజారి ఛాతీ, చేతి భాగంలో కాలిన ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు.. పూజారిది హత్యా?, ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Temple priest suspicious death in Hayath Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News