Thursday, November 14, 2024

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

- Advertisement -
- Advertisement -
  • ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మన తెలంగాణ/పటాన్‌చెరు: దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాని ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం మండల పరిధిలోని ఇస్నాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠతోపాటు, పటాన్‌చెరు జిహెచ్‌ఎంసి పరిధిలోని జెపి కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కన్యకా మరమేశ్వరి దేవాలయ నిర్మాణ భూ మి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వైశ్యుల కోసం దేవాలయం నిర్మించడం సంతోషాన్ని కలిగించే విషయమన్నారు.

ఆలయాల అభివృద్ధికి తానవంతు సహయ సహకారాలు ఎల్లప్పు డు ఉంటాయన్నారు.నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పురాతన దేవాలయా ల అభివృద్ధికి తానేంతగానో కృషి చేస్తున్నానన్నారు. నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నానన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పురాతన దేవాలయాలు ఇప్పటికే అభివృద్ది చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు మంజురు చేస్తు ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి, కార్పొరేటర్ మెట్టు కుమార్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీశైలం, అంజిరెడ్డి,గోవర్దన్ రెడ్డి, రాజులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News