Monday, December 23, 2024

ఆలయాలు సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతి బింబాలు

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఆలయాలు మన సంసృతి సంప్రాదయాలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసినగర్ కాలనీలోని విజయగణపతి దేవాలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్, ఎమ్మె ల్యే సుభాష్‌రెడ్డిలు ఆలయ ప్రతినిధులతో కలిసి విడివిడిగా ప్రత్యేక పూజలు చేశారు. దేవతలతో సమానమైన గోవుల గోశాలను ప్రారం భించడం అదృష్టంగా భావిస్తున్ననని తెలిపారు.

అనంతరం డివిజన్ పరిధిలోని ఇందిరగృహకల్ప కాలనీలో నిర్మిస్తున్న శివాలయ భూమిపూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈసినగర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, కమిటీ ప్రతినిధు లు చెన్నయ్యగౌడ్, శివయ్య, శ్యాంకుమార్, రమణరావు, నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్‌రావు, రమేష్, మాజీ కార్పొరేటర్ దన్‌పాల్‌రెడ్డి,స్థ్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News