Tuesday, November 5, 2024

ప్రభుత్వ నిధులతో దేవాలయాల అభివృద్ధి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సిఎ కెసిఆర్ దే

దుబ్బాక లో వేడుకగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట: ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి వారికి మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు రఘునందన్ రావులు స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హరీష్ రావు మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు దేవాలయానికి సంబంధించిన నిధులను ప్రభుత్వాలు, ప్రజా అవసరాలకు వాడుకునేవారన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వమే దేవాలయాల నిర్మాణం , పునర్నిర్మాణం, జీర్ణ దేవాలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుందన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సైతం దేవుళ్ళ పేర్లను పెట్టారని మంత్రి తన్నీరు హరీష్ రావు గుర్తు చేశారు.

దేవుడి ఆశీస్సులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ధృఢ సంకల్పంతో నే 2020-21 సంవత్సరంలో దేశంలోనే తెలంగాణ అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. తద్వారా దేశానికే ధాన్యపు భాండాగారంగా నిలిచిందని కొనియాడారు. దేవుడి ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. తలసరి ఆదాయం లో దేశంలో టాప్ రెండు, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ నెం.1 గా నిలబడిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో తలసరి ఆదాయం లో చివరి స్థానంలో ఉన్న మనం ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు, సిఎం దీర్ఘ దృష్టితో జిఎస్ డిపి , తలసరి ఆదాయంలో ముందు వరుసలో నిలిచామన్నారు. దేశానికే దిక్సూచి, ఆదర్శంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణమని మెచ్చుకున్నారు. 2009లో దుబ్బాకలో వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టామని, దుబ్బాక ప్రాంతం కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కనిపిస్తోందని హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి జలాలలో దుబ్బాక అభివృద్ధి చెందుతుందన్నారు. దుబ్బాక లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అద్భుతంగా ఉందన్నారు. దేవాలయం నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా రూ.4 కోట్ల 25 లక్షలు, వ్యక్తిగతంగా రూ. కోటి రూపాయలు అందజేశారనీ మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News