నాసిక్: మహారాష్ట్రలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత 24 గంటల్లో సంభవించిన తొమ్మిది మరణాలు కూడా ఉన్నాయి. పిడుగుపాటు, కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, వరదలు, నిర్మాణం కూలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ మరణాలు సంభవించాయి. రాష్ట్ర డిసాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎస్ డిఎం) నివేదిక ప్రకారం జూన్ 1 నుండి దాదాపు 125 జంతువులు కూడా ఈ విపత్తులలో మరణించాయి. ముఖ్యంగా జులై 12 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది, కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో 64 మిమీ. నుండి 200 మిల్లీమీటర్ల మేరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇదిలావుండగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాసిక్‌లోని గోదావరి నదిలో పలు ఆలయాలు నీట మునిగాయి.
#WATCH | Maharashtra: Various temples submerge under the Godavari river in Nashik, due to incessant rain for the past three days pic.twitter.com/AvAr7JYoYE
— ANI (@ANI) July 11, 2022